Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

అంతరంగాలు | Antarangalu

అంతరంగాలు | Antarangalu artwork

గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం

Mar 27, 202619 minAudioSeason 1, Episode 14
ShareXLinkedInFacebookWhatsAppEmail

గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం ప్రతి శ్రీరామ నవమికి మనం శ్రీరాముడిని పూజిస్తాం. కల్యాణం చేస్తాం. హారతి ఇస్తాం. ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం. కానీ ఒక ప్రశ్న మాత్రం నన్ను కొన్నేళ్లుగా వెంటాడుతోంది. శ్రీరాముడిని గుడిలో ఎంతగా ఆరాధిస్తున్నామో, ఆయన గుణాలను మన జీవితంలో అంతగా ఆచరిస్తున్నామా? గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి శ్రీరామ నవమికి శ్రీరాముడి జీవితంలో నాకు కనిపించిన కొన్ని విషయాలను రాస్తూ వచ్చాను. 2023లో - మానవ మర్యాదకు ప్రతిరూపమైన శ్రీరాముడు. 2024లో - శ్రీరాముడు అనే జీవన విధానం. 2025లో - ఆత్మాలయంలోని శ్రీరాముడు. ఆ ఆలోచనలన్నింటినీ కలిపి చూస్తే నాకు కనిపించిన ప్రయాణమే ఈ ఎపిసోడ్. ఇది శ్రీరాముడి దైవత్వం గురించి చెప్పే ప్రయత్నం కాదు. ఆయన జీవితంలో కనిపించే నిరాడంబరత, ప్రశాంతత, కరుణ, ధర్మబద్ధత, సహనం, స్వీయనిగ్రహం, వివేకం - ఇవి మన జీవితంలో ఎంతవరకు ఉన్నాయో మనమే మనల్ని ప్రశ్నించుకునే ప్రయత్నం. ధర్మాన్ని పాటించడం అంటే ప్రతిసారీ గెలవడమేనా? కఠినమైన నిర్ణయం తీసుకోవడం అంటే మనసును చంపుకోవడమేనా? భక్తి అంటే పూజ చేయడమేనా - లేక పక్కవాడి బాధను అర్థం చేసుకోవడమా? న్యాయం అంటే కఠినత్వమా - లేక మానవత్వంపై నమ్మకమా? మనలోనే ఉండాల్సిన శ్రీరాముడిని ఎప్పుడో ఆకాశమంత ఎత్తుకు ఎత్తి, ఆత్మాలయం నుంచి తీసి గుడిలో పెట్టేశామేమో. అందుకే ఈ శ్రీరామ నవమికి ఒక చిన్న ప్రయాణం చేద్దాం. గుడిలోని శ్రీరాముడి నుంచి… గుండెలోని శ్రీరాముడి దాకా. శ్రీరాముడిని మరింత గొప్ప దేవుడిగా చేయడానికి కాదు. మనల్ని కొంచెం మంచి మనుషులుగా మార్చుకోవడానికి.ఇది రామాయణ కథనం కాదు. ఇది శ్రీరాముడిని చూసే నా దృష్టిలో జరిగిన ప్రయాణం శ్రీరామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. 🙏

Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

Hosts and Guests

Nobody is credited on this episode yet.

Credit the people on this episode

Be the first to rate this episode

More episodes

All episodes
  1. ఇంటింటి రామాయణం

    Nov 4, 202617 minAudio

    మిథిలలో రాముడు ఆటపట్టించదగిన ఇంటి అల్లుడు. సీత తమింటి ఆడబిడ్డ. తెలుగు పాటల్లో వారిద్దరూ అలకలు, చనువులు, అనుబంధాలతో మనకు దగ్గరవుతారు. సముద్రం దాటితే, ఆగ్నేయాసియా ప్రజల భాషల్లో, కళల్లో, కథల్లో మరో ఆత్మీయ రూపంలో...

    Credit the people on this episode

  2. నా పులిహోర ఎక్కడ?

    Sep 27, 202621 minAudio

    నా పులిహోర ఎక్కడ? వినాయక చవితి నాకు కొత్త పండుగ కాదు. చిన్నప్పటి నుంచి వినాయక వ్రతం, కథ, స్యమంతకమణి, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర, ఇవన్నీ ఈ పండుగతో కలిసి పెరిగిన జ్ఞాపకాలు. కానీ మహారాష్ట్రలో గణేశోత్సవాన్ని దగ్గరగా...

    Credit the people on this episode

  3. విఘ్నేశుడే విఘ్నమైన వేళ

    Sep 13, 202622 minAudio

    విఘ్నేశుడే విఘ్నమైన వేళ అడ్డంకిని తొలగించే ముందు - అది ఎందుకు ఉందో అర్థం చేసుకోగలమా? ప్రతి శుభారంభానికి ముందు మనం గణేశుడిని ప్రార్థిస్తాం - మన మార్గంలోని విఘ్నాలను తొలగించమని కోరుకుంటాం. కానీ విఘ్నాలను తొలగించే దేవుడిగా...

    Credit the people on this episode

  4. ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు

    Aug 30, 202618 minAudio

    The Music Beneath the Music | ఇళయరాజా ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు కొన్ని పాటలు మనం వింటాం. కొన్ని పాటలు మనతో ఉండిపోతాయి. మరికొన్ని పాటలు మాత్రం మనం పెరిగే కొద్దీ, మనతో పాటు అవీ కొత్తగా వినిపిస్తుంటాయి....

    Credit the people on this episode

  5. ఫోటోలో క్షణం ఉంది… జ్ఞాపకంలో ఏముంది

    Aug 23, 202617 minAudio

    ఖార్‌ఘర్‌లోని ఒక అందమైన ఆలయంలో నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న విషయం నన్ను ఆలోచింపజేసింది. నా ముందున్న శిల్పాన్ని నేరుగా చూడకుండా, దాని మధ్యలో కొన్ని mobile screens కనిపించాయి. అక్కడి నుంచి మరో ప్రశ్న మొదలైంది. Formula 1...

    Credit the people on this episode