
ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు
The Music Beneath the Music | ఇళయరాజా ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు కొన్ని పాటలు మనం వింటాం. కొన్ని పాటలు మనతో ఉండిపోతాయి. మరికొన్ని పాటలు మాత్రం మనం పెరిగే కొద్దీ, మనతో పాటు అవీ కొత్తగా వినిపిస్తుంటాయి. ఇళయరాజా సంగీతం నాకు అలాంటిదే. ఎన్నో సంవత్సరాలుగా వింటున్న ఆమని పాడవే, ఎదలో లయ, ఓం నమః, తకిట తదిమి వంటి పాటలను మరోసారి - ఈసారి కొంచెం లోతుగా - వినే ప్రయత్నమే ఈ Antarangalu episode. ఒక అందమైన melody వెనుక bass ఏం చేస్తోంది? Singer ఒక దారిలో వెళ్తుంటే strings మరో melodic line ఎలా నిర్మిస్తున్నాయి? Interlude మనల్ని ఎక్కడికో తీసుకెళ్లి మళ్లీ charanam దగ్గరకు అంత సహజంగా ఎలా తీసుకొస్తుంది? Rhythm, raga, harmony, counterpoint, orchestration, call-and-response, silence - ఇవన్నీ మనకు తెలియకుండానే మన emotion మీద ఎలా పనిచేస్తాయి? ఆమని పాడవేలోని సున్నితత్వం నుంచి ఎదలో లయలో S. Janaki గారి voice-flute సంభాషణ వరకు, పాటల నుంచి background score వరకు - ఇళయరాజా సంగీతంలో మనం వింటున్న సంగీతం కింద ఇంకెంత సంగీతం దాగి ఉందో వెతికే ప్రయత్నం ఇది. ఇది ఇళయరాజా గారి biography కాదు. ఆయన గొప్పతనాన్ని చెప్పే మరో tribute కూడా కాదు. మనకు బాగా తెలిసిన పాటలను మరోసారి కొత్తగా వినడానికి ఒక invitation. ఎందుకంటే పాటలు మారలేదు. మారింది మన listening. ఈ episode, govindvarma.comలో నేను రాసిన “The Music Beneath the Music - Why the Maestro Still Surprises Me After All These Years” అనే వ్యాసం ఆధారంగా రూపొందించబడింది. https://govindvarma.com/celebrating-the-maestro-a-tribute-to-ilayarajas-musical-genius/ 🎧 Antarangalu - వినడం కాదు… కొంచెం లోపలికి వెళ్లి వినడం.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
