
నా పులిహోర ఎక్కడ?
నా పులిహోర ఎక్కడ? వినాయక చవితి నాకు కొత్త పండుగ కాదు. చిన్నప్పటి నుంచి వినాయక వ్రతం, కథ, స్యమంతకమణి, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర, ఇవన్నీ ఈ పండుగతో కలిసి పెరిగిన జ్ఞాపకాలు. కానీ మహారాష్ట్రలో గణేశోత్సవాన్ని దగ్గరగా చూసినప్పుడు, అదే గణేశుడిని మరో సాంస్కృతిక భాషలో చూసిన అనుభూతి కలిగింది. ఇక్కడ కథ కంటే ఉత్సవం ఎక్కువగా కనిపించింది. వ్రతం కంటే సామూహిక ఆరతి. “జై దేవ్ జై దేవ్…” నుంచి పాండురంగుడి వరకు వెళ్లే ఆరతి. “గణపతి బప్పా మోర్యా” వెనుక ఉన్న చరిత్ర. మండళ్లు, మోదకాలు, లాల్బాగ్చా రాజా, కొంకణ్కు తిరిగి వెళ్లే కుటుంబాలు, ఇంటి గణపతి దగ్గర కలిసే మనుషులు… అందులో మనోజ్ గవాండ్ నడిపించిన ఆరతి, నికితా జీ ఇంట్లో గణపతి దర్శనం, “Maratha Momos” అంటూ నేను మోదకాలకు పెట్టుకున్న పేరు, ఇవన్నీ కలిసి ఈ అనుభవాన్ని మరింత వ్యక్తిగతంగా మార్చాయి. ఇది ఆంధ్రా vs మహారాష్ట్ర కథ కాదు. భక్తిని తూకం వేసే ప్రయత్నమూ కాదు. అదే గణేశుడిని రెండు ప్రాంతాలు ఎలా వేర్వేరు పద్ధతుల్లో గుర్తుంచుకుంటాయో, జీవిస్తాయో చూసిన ఒక వ్యక్తిగత ప్రయాణం. మరి అంతా బాగానే ఉంది… కానీ నా పులిహోర ఎక్కడ? ఈ ఎపిసోడ్కు ఆధారమైన పూర్తి బ్లాగ్ పోస్టును ఇక్కడ చదవండి: https://govindvarma.com/where-is-my-pulihora/ అంతరంగాలు | Antarangalu వ్యక్తిగత అనుభవాలు, సంస్కృతి, జ్ఞాపకాలు - కొంచెం లోపలికి చూసే సంభాషణలు.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
