Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

అంతరంగాలు | Antarangalu

అంతరంగాలు | Antarangalu artwork

ఇంటింటి రామాయణం

Nov 4, 202617 minAudioSeason 1, Episode 19
ShareXLinkedInFacebookWhatsAppEmail

మిథిలలో రాముడు ఆటపట్టించదగిన ఇంటి అల్లుడు. సీత తమింటి ఆడబిడ్డ. తెలుగు పాటల్లో వారిద్దరూ అలకలు, చనువులు, అనుబంధాలతో మనకు దగ్గరవుతారు. సముద్రం దాటితే, ఆగ్నేయాసియా ప్రజల భాషల్లో, కళల్లో, కథల్లో మరో ఆత్మీయ రూపంలో పలకరిస్తారు. గోరఖ్‌పూర్‌కు చెందిన మిశ్రా గారు, దర్భంగా ప్రాంతానికి చెందిన కన్హయ్యా గారితో నా సంభాషణ ఒక అన్వేషణకు దారితీసింది: ఇన్ని ప్రాంతాల ప్రజలు రామసీతలను తమ ఇంటి మనుషులుగా ఎలా చేసుకున్నారు? “గోదావరి” పాటలో వేటూరి గారి సున్నితమైన ఊహ నుంచి ఉత్తరాంధ్ర మహిళల రామాయణ పాటలు, “సీత గడియ”లోని కుటుంబ బంధాలు, భద్రాచలం కల్యాణం, ఆగ్నేయాసియా రంగస్థలాల వరకు సాగే ఆ అన్వేషణే ఈ ఎపిసోడ్. నా చిన్నతనంలో రామానంద్ సాగర్ రామాయణం మా తరానికి ఈ కథను దగ్గర చేసింది. కొత్త రామాయణం సినిమా నేటి పిల్లలకు అలాంటి పరిచయాన్ని అందించగలదా? తరాలు మారినా, చెప్పే తీరు మారినా, ప్రతి ఇంట్లో తనకంటూ చోటు సంపాదించుకునే రామకథ గురించి ఒక ఆత్మీయ సంభాషణ. పూర్తి వ్యాసం, సంబంధిత ఆధారాలు: govindvarma.com మీ ఇంట్లో వినిపించిన రామాయణ పాట లేదా కథ ఏది?

Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

Hosts and Guests

Nobody is credited on this episode yet.

Credit the people on this episode

Be the first to rate this episode

More episodes

All episodes
  1. నా పులిహోర ఎక్కడ?

    Sep 27, 202621 minAudio

    నా పులిహోర ఎక్కడ? వినాయక చవితి నాకు కొత్త పండుగ కాదు. చిన్నప్పటి నుంచి వినాయక వ్రతం, కథ, స్యమంతకమణి, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర, ఇవన్నీ ఈ పండుగతో కలిసి పెరిగిన జ్ఞాపకాలు. కానీ మహారాష్ట్రలో గణేశోత్సవాన్ని దగ్గరగా...

    Credit the people on this episode

  2. విఘ్నేశుడే విఘ్నమైన వేళ

    Sep 13, 202622 minAudio

    విఘ్నేశుడే విఘ్నమైన వేళ అడ్డంకిని తొలగించే ముందు - అది ఎందుకు ఉందో అర్థం చేసుకోగలమా? ప్రతి శుభారంభానికి ముందు మనం గణేశుడిని ప్రార్థిస్తాం - మన మార్గంలోని విఘ్నాలను తొలగించమని కోరుకుంటాం. కానీ విఘ్నాలను తొలగించే దేవుడిగా...

    Credit the people on this episode

  3. ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు

    Aug 30, 202618 minAudio

    The Music Beneath the Music | ఇళయరాజా ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు కొన్ని పాటలు మనం వింటాం. కొన్ని పాటలు మనతో ఉండిపోతాయి. మరికొన్ని పాటలు మాత్రం మనం పెరిగే కొద్దీ, మనతో పాటు అవీ కొత్తగా వినిపిస్తుంటాయి....

    Credit the people on this episode

  4. ఫోటోలో క్షణం ఉంది… జ్ఞాపకంలో ఏముంది

    Aug 23, 202617 minAudio

    ఖార్‌ఘర్‌లోని ఒక అందమైన ఆలయంలో నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న విషయం నన్ను ఆలోచింపజేసింది. నా ముందున్న శిల్పాన్ని నేరుగా చూడకుండా, దాని మధ్యలో కొన్ని mobile screens కనిపించాయి. అక్కడి నుంచి మరో ప్రశ్న మొదలైంది. Formula 1...

    Credit the people on this episode

  5. గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం

    Mar 27, 202619 minAudio

    గుడిలోని శ్రీరాముడి నుంచి గుండెలోని శ్రీరాముడి దాకా మన ప్రయాణం ప్రతి శ్రీరామ నవమికి మనం శ్రీరాముడిని పూజిస్తాం. కల్యాణం చేస్తాం. హారతి ఇస్తాం. ఆయన గొప్పతనం గురించి మాట్లాడుకుంటాం. కానీ ఒక ప్రశ్న మాత్రం నన్ను...

    Credit the people on this episode