Skip to content
PodSubs
ShowsPeopleGuestsJobsNewsEvents
More
BlogPodCred
Menu
ShowsPeopleGuestsJobsNewsEventsBlogPodCredNetworksSign in
Join nowSign in
  • Shows
  • People
  • Jobs
  • News
  • More
    • Guests
    • Events
    • Blog
    • PodCred
    • Networks
    Join nowSign in

అంతరంగాలు | Antarangalu

అంతరంగాలు | Antarangalu artwork

రుచి మరిచిన మనుషులు

Nov 9, 202518 minAudioSeason 1, Episode 9
ShareXLinkedInFacebookWhatsAppEmail

రుచి మరిచిన మనుషులు ఒక dinner కూడా మనల్ని ప్రశ్నించగలదా? గత వారం జమ్మూ నుంచి వచ్చిన ఒక స్నేహితుడితో Vizagలో బయటికి వెళ్లాను. అతను కాశ్మీరీ. నేను ఆంధ్రవాడిని. అతనికి సముద్రం అంటే ఇష్టం. నాకు కొండలు అంటే ఇష్టం. అందుకే అనుకున్నాను - ఒక మంచి Andhra mealతో evening complete చేద్దాం అని. నా చిన్నప్పటి నుంచి గుర్తున్న ఒక హోటల్‌కి తీసుకెళ్లాను. అక్కడి thali, పప్పు, కూర, పచ్చడి, పొడి, పెరుగు… అన్నీ గుర్తొచ్చాయి. కానీ waiter చెప్పిన మాట ఒక్కసారిగా ఆ nostalgiaని ఆపేసింది. “Sir, South Indian thaliకి hardly any takers these days.” ఆ ఒక్క sentence భోజనం కంటే ఎక్కువసేపు నా మనసులో మిగిలిపోయింది. మన రుచులు మారుతున్నాయా? లేక మనమే మన రుచులను మర్చిపోతున్నామా? ఈ అంతరంగాలు ఎపిసోడ్‌లో నేను food గురించి మాత్రమే మాట్లాడటం లేదు. మన taste budsతో పాటు మన cultural memory కూడా మారుతోందా అన్న ప్రశ్న గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు special occasion అంటే పులిహోర, బొబ్బట్లు, గారెలు, పాయసం. ఇప్పుడు celebration అంటే pizza, pasta, burger, fried rice. ఇందులో తప్పేం లేదు. ప్రపంచం దగ్గరైంది. మన menus కూడా పెద్దవయ్యాయి. కానీ కొత్త రుచులు నేర్చుకుంటూ… మన రుచులను మాత్రం మరిచిపోతున్నామా? మన అమ్మ చేసిన పప్పులో ఒక రుచి ఉంటుంది. అమ్మమ్మ వేసిన పచ్చడిలో ఇంకో రుచి ఉంటుంది. అది recipeలో ఉండదు. అది memoryలో ఉంటుంది. అది ఒక ప్రాంతం, ఒక ఇంటి వాతావరణం, ఒక కాలం - all rolled into one. బహుశా food అనేది hunger తీర్చేదే కాదు. అది మనల్ని మన మూలాలకు కట్టిపడేసే invisible thread కూడా. అందుకే ఈ ఎపిసోడ్ చివరికి నాకు వచ్చిన ప్రశ్న చాలా simple: మన పిల్లలకు కొత్త రుచులు నేర్పుతున్నాం… మన రుచులు కూడా పరిచయం చేస్తున్నామా? ఎందుకంటే ఒక cuisine మాయమవడం అంటే కొన్ని dishes మాయమవడం మాత్రమే కాదు. ఒక జ్ఞాపకం, ఒక కుటుంబం, ఒక ప్రాంతం - కొంచెం కొంచెంగా మాయమవడం.

Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

Hosts and Guests

Nobody is credited on this episode yet.

Credit the people on this episode

Be the first to rate this episode

More episodes

All episodes
  1. ఇంటింటి రామాయణం

    Nov 4, 202617 minAudio

    మిథిలలో రాముడు ఆటపట్టించదగిన ఇంటి అల్లుడు. సీత తమింటి ఆడబిడ్డ. తెలుగు పాటల్లో వారిద్దరూ అలకలు, చనువులు, అనుబంధాలతో మనకు దగ్గరవుతారు. సముద్రం దాటితే, ఆగ్నేయాసియా ప్రజల భాషల్లో, కళల్లో, కథల్లో మరో ఆత్మీయ రూపంలో...

    Credit the people on this episode

  2. నా పులిహోర ఎక్కడ?

    Sep 27, 202621 minAudio

    నా పులిహోర ఎక్కడ? వినాయక చవితి నాకు కొత్త పండుగ కాదు. చిన్నప్పటి నుంచి వినాయక వ్రతం, కథ, స్యమంతకమణి, ఉండ్రాళ్లు, కుడుములు, పులిహోర, ఇవన్నీ ఈ పండుగతో కలిసి పెరిగిన జ్ఞాపకాలు. కానీ మహారాష్ట్రలో గణేశోత్సవాన్ని దగ్గరగా...

    Credit the people on this episode

  3. విఘ్నేశుడే విఘ్నమైన వేళ

    Sep 13, 202622 minAudio

    విఘ్నేశుడే విఘ్నమైన వేళ అడ్డంకిని తొలగించే ముందు - అది ఎందుకు ఉందో అర్థం చేసుకోగలమా? ప్రతి శుభారంభానికి ముందు మనం గణేశుడిని ప్రార్థిస్తాం - మన మార్గంలోని విఘ్నాలను తొలగించమని కోరుకుంటాం. కానీ విఘ్నాలను తొలగించే దేవుడిగా...

    Credit the people on this episode

  4. ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు

    Aug 30, 202618 minAudio

    The Music Beneath the Music | ఇళయరాజా ఇళయరాజా పాటల్లోని ఆ అద్భుతమైన సంగీత పొరలు కొన్ని పాటలు మనం వింటాం. కొన్ని పాటలు మనతో ఉండిపోతాయి. మరికొన్ని పాటలు మాత్రం మనం పెరిగే కొద్దీ, మనతో పాటు అవీ కొత్తగా వినిపిస్తుంటాయి....

    Credit the people on this episode

  5. ఫోటోలో క్షణం ఉంది… జ్ఞాపకంలో ఏముంది

    Aug 23, 202617 minAudio

    ఖార్‌ఘర్‌లోని ఒక అందమైన ఆలయంలో నిలబడి ఉన్నప్పుడు ఒక చిన్న విషయం నన్ను ఆలోచింపజేసింది. నా ముందున్న శిల్పాన్ని నేరుగా చూడకుండా, దాని మధ్యలో కొన్ని mobile screens కనిపించాయి. అక్కడి నుంచి మరో ప్రశ్న మొదలైంది. Formula 1...

    Credit the people on this episode