
దైవదర్శనం సరే, మరి భక్తి మాటేంటి ?
దైవదర్శనం సరే, మరి భక్తి మాటేంటి? గుడికి వెళ్తాం. క్యూలో నిలబడతాం. కొన్నిసార్లు గంటలు. మరికొన్నిసార్లు - “Special Darshan ఎంత?” అని అడుగుతాం. డబ్బు చెల్లిస్తాం. Queue దాటుతాం. దేవుడిని త్వరగా చూసేస్తాం. బయటికి వచ్చేస్తాం. అంతా బాగానే ఉంది. కానీ ఒకరోజు నాకు ఒక చిన్న ప్రశ్న వచ్చింది - దైవదర్శనాన్ని త్వరగా చేసుకోవచ్చు. మరి భక్తిని కూడా త్వరగా చేసుకోవచ్చా? మన జీవితంలో almost everything fast అయిపోయింది. Fast food. Fast delivery. Fast travel. Instant messages. One-click payments. ఇప్పుడు spiritualityకి కూడా express lane కావాలనుకుంటున్నామా? ఈ అంతరంగాలు ఎపిసోడ్లో నేను special darshan మంచిదా, చెడ్డదా అని తీర్పు చెప్పడం లేదు. నాకు వచ్చిన ప్రశ్న ఇంకొంచెం లోపలిది. దేవుడిని చూడటానికి మనం ఎంత effort పెడుతున్నామన్నది కాదు - దేవుడి ముందు మనం ఎంతవరకు ఆగగలుగుతున్నాం? దర్శనం కొన్ని seconds ఉండొచ్చు. కానీ భక్తి? అది queue lengthతో కొలవలేం. Ticket priceతో కొనలేం. VIP entranceతో shortcut తీసుకోలేం. బహుశా భక్తి అంటే మనకు కావాల్సింది అడగడం మాత్రమే కాదు. కొద్దిసేపు ఏమీ అడగకుండా ఉండటం కూడా కావచ్చు. మనసులోని noise తగ్గించడం. మన impatienceని గుర్తించడం. మన egoని కాస్త బయటే వదిలేయడం. అందుకే నాకు దేవాలయం అంటే దేవుడు బంధించబడిన స్థలం అనిపించదు. అది మనం మనలోకి తిరిగి వెళ్లడానికి పెట్టుకున్న ఒక reminderలా అనిపిస్తుంది. కానీ అక్కడికి కూడా మన hurryని తీసుకెళ్తే? దేవుడిని చూసి వచ్చేస్తాం. బహుశా మనల్ని మనం మాత్రం చూడలేము. ఈరోజు మనకు దేవుడి దగ్గరకు వెళ్లడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అసలు ప్రశ్న - మనలోని నిశ్శబ్దం దగ్గరకు వెళ్లడానికి మనకు ఇంకా మార్గం ఉందా? దైవదర్శనం తప్పకుండా చేసుకుందాం. కానీ అప్పుడప్పుడు ఒకసారి… భక్తి ఎక్కడ ఉందో కూడా చూసుకుందాం.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
