
సప్తపది
సప్తపది ఒకప్పుడు పెళ్లి అంటే… ఇంటి ముందు పందిరి. బంధువుల హడావిడి. పెద్దల మాటలు. మంత్రాలు. సప్తపది. ఇప్పుడు? Venue. Theme. Pre-wedding shoot. Destination. Designer outfits. Drone camera. Reels. Hashtags. అన్నీ ఉన్నాయి. కానీ ఒకరోజు నాకు ఒక చిన్న సందేహం వచ్చింది - పెళ్లి పెద్దదవుతోంది… మరి వివాహం కూడా అంతే బలంగా మారుతోందా? ఈ అంతరంగాలు ఎపిసోడ్ ఆ ప్రశ్న గురించే. మన సంప్రదాయంలో సప్తపది అంటే కేవలం ఏడడుగులు కాదు. ఇద్దరూ కలిసి జీవితం వైపు వేస్తున్న ఏడడుగులు. ఆహారం. ఆరోగ్యం. సంపద. కుటుంబం. సహచర్యం. బాధ్యత. చివరికి ఒకరికొకరు తోడుగా ఉండే వాగ్దానం. అంటే ceremony కన్నా ముందు ఒక philosophy ఉంది. కానీ ఇప్పుడు పెళ్లి preparationsలో మనం ఎక్కువగా మాట్లాడేది ఏంటి? Menu. Decoration. Guest list. Photography. Return gifts. Budget. ఇందులో తప్పేం లేదు. సంతోషాన్ని ఘనంగా జరుపుకోవడంలో తప్పు లేదు. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగులుతోంది - ఆ celebration కోసం కొత్త జీవితాన్ని అప్పులతో మొదలుపెట్టడం ఎంతవరకు అవసరం? ఒక్క రోజు కోసం సంవత్సరాల savings ఖర్చు చేయడం… లేదా ఇతరులు ఏమనుకుంటారో అన్న భయంతో మన capacityకి మించిన పెళ్లి చేయడం… ఇవి మన traditionనా? లేక మన insecurityనా? Social media ఇంకో interesting pressure తీసుకొచ్చింది. మన పెళ్లి మనకోసం మాత్రమే కాదు. చూడని వాళ్లకోసం కూడా. Photograph చేయని moment incompleteగా అనిపిస్తోంది. Post చేయని celebration జరగనట్టే అనిపిస్తోంది. అప్పుడు సప్తపదిలోని ఏడడుగుల కన్నా… camera ముందు వేసే అడుగులే ఎక్కువైపోతున్నాయేమో. నాకు simple wedding అంటే poverty అనిపించదు. అలాగే grand wedding అంటే తప్పు కూడా కాదు. Question ఇంకోటి. మనకు choice ఉందా? లేక comparison మన కోసం నిర్ణయం తీసుకుంటుందా? పెళ్లి తర్వాత ఇద్దరూ మొదలుపెట్టేది ఒక జీవితం. ఆ జీవితానికి financial independence కావాలి. Mental space కావాలి. Mutual respect కావాలి. Companionship కావాలి. ఇవి wedding albumలో కనిపించవు. కానీ marriageని నిలబెట్టేది ఇవే. అందుకే నాకు ఇప్పుడు సప్తపది చూస్తే ఏడడుగులు మాత్రమే కనిపించవు. ఒక reminder కనిపిస్తుంది. పెళ్లి ఒక event కాదు. ఒక journey. Event ఒకరోజు ముగుస్తుంది. Photos కొన్ని సంవత్సరాలు ఉంటాయి. కానీ ఆ ఏడడుగుల అర్థం… ఇద్దరూ కలిసి నడిచినంతకాలం ఉండాలి.
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.
