
నిశ్శబ్దం కోసం
నిశ్శబ్దం కోసం ఒకప్పుడు వేగంగా వెళ్లడమే కల. బస్సులో కూర్చొని ఆకాశంలో వెళ్తున్న విమానాన్ని చూస్తూ - “ఒకరోజు నేనూ ఇలా ప్రయాణించాలి” అనుకునే వాళ్లం. ఇప్పుడు విమానాలు సాధారణమయ్యాయి. కానీ ఎక్కడో ఒక ఎద్దుల బండి కనిపిస్తే… “ఒక్కసారి ఇలా నెమ్మదిగా వెళ్తే ఎంత బాగుంటుందో” అనిపిస్తోంది. ఒకప్పుడు hotelలో భోజనం చేయడం luxury. ఇప్పుడు ఇంట్లో ప్రశాంతంగా వండుకుని తినడానికి సమయం దొరకడం luxury. ఒకప్పుడు ఎక్కువ options కావాలనుకున్నాం. ఇప్పుడు fewer notifications కావాలనుకుంటున్నాం. ఒకప్పుడు ప్రపంచంతో connected కావడం గొప్ప విషయం. ఇప్పుడు కొద్దిసేపైనా disconnect కావాలని అనిపిస్తోంది. అప్పుడు నాకు ఒక సందేహం వచ్చింది. మన జీవితం నిజంగా సౌకర్యవంతమైందా? లేక వేగవంతమైందా? ఈ అంతరంగాలు ఎపిసోడ్ ఆ ప్రశ్న నుంచే మొదలైంది. మనకు technology చాలా ఇచ్చింది. సమయం ఆదా చేసింది. దూరాలను తగ్గించింది. ప్రపంచాన్ని చేతిలో పెట్టింది. కానీ అదే సమయంలో… మన రోజు మొత్తాన్ని చిన్న చిన్న interruptionsగా మార్చేసిందేమో. Phone మోగుతుంది. Message వస్తుంది. Mail వస్తుంది. ఏదో update. ఏదో reminder. ఏదో చేయాల్సిందే అన్న భావన. అన్నీ పూర్తయ్యాక మిగిలేది ఒక విచిత్రమైన అలసట. శరీరానికి కాకుండా… మనసుకి. అందుకే ఇప్పుడు నాకు silence అంటే sound లేకపోవడం మాత్రమే అనిపించడం లేదు. ఎవరూ ఏమీ అడగని పది నిమిషాలు. Phone చూడకుండా తాగే ఒక cup of coffee. గమ్యం గురించి తొందరపడకుండా చేసే ప్రయాణం. ఇంట్లో నెమ్మదిగా వండే భోజనం. ఏమీ చేయకుండా కూర్చునే కొద్దిసేపు. బహుశా ఇవే ఇప్పుడు కొత్త luxuries. మన పూర్వీకుల జీవితంలో slowగా ఉండటం choice కాదు. మన జీవితంలో మాత్రం slowగా ఉండటం conscious decision కావాల్సి వచ్చింది. ఎంత విచిత్రం కదా? మనిషి వేగం కోసం ఎన్నో యంత్రాలు తయారు చేశాడు. ఇప్పుడు అదే మనిషి… నెమ్మదిగా ఉండటానికి మార్గాలు వెతుకుతున్నాడు. బహుశా మనకు కావాల్సింది జీవితాన్ని ఆపేయడం కాదు. అందులో కొంచెం ఖాళీ సృష్టించడం. కొంచెం నిశ్శబ్దం. కొంచెం boredom కూడా. కొంచెం మనతో మనం ఉండే సమయం. ఎందుకంటే ప్రతి క్షణాన్నీ నింపేస్తే… మన అంతరంగం మాట్లాడేది మనకు ఎప్పుడు వినిపిస్తుంది?
Audio and video play straight from the show's own hosting. PodSubs stores and serves no media.

